• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాంకేతిక అభివృద్దే కీలకం: రాష్ట్రపతి

By Staff
|

హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానంలోని ప్రగతి మానవాళి అభివృద్దికి ఆలంబన కావాలని రాష్ట్రపతి డాక్టర్‌ ఎ.పి.జె అబ్దుల్‌ కలామ్‌ అన్నారు. ఈ ఆధునిక కాలంలో వైద్యరంగానికి శాస్త్రసాంకేతిక రంగాలే దిశానిర్దేశం చేయాలని ఆయన శాస్త్రవేత్తలకు సూచించారు. హైదరాబాద్‌ లోని నిమ్స్‌ మెడికల్‌ కాలేజ్‌ మూడో స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ డీమ్డ్‌ యూనివర్శిటీకి ఛాన్సలర్‌ గా వ్యహరిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

ఎలక్ట్రానిక్‌ సిటిజన్‌ కార్డ్‌ ను ప్రేవేశపెట్టాలని కలాం సూచించారు. ఐటి, ఇతర సాంకేతిక రంగాల్లోని పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రోగులకు మరింత ఉత్తమమైన వైద్యసేవలుఅందించేలా ఆధునిక వైద్యులు పాటుపడాలని ఆయన అన్నారు. టెలీమెడిసిన్‌ ను మరింత విస్తృతంగా అమల్లోకి తేవాలని ఆయనకోరారు. టెలీ మెడిసిన్‌, టెలీసర్జరీలకు సంబంధించిన సాప్ట్‌ వేర్‌ ను మరింత అభివృద్ది పరచాలని ఆయనపేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X