• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీడని కరీంనగర్‌ మరణాలమిస్టరీ

By Staff
|

కరీంనగర్‌: విహార యాత్రకు బయలుదేరి మానేరు డ్యామ్‌లోవిద్యార్థులు శవాలై తేలిన సంఘటన మిస్టరీ ఇంకా వీడలేదు. బాసర పుణ్య క్షేత్రానికి విహార యాత్రకు వెళ్లి వస్తుండగా మారుతీ వ్యాన్‌ తప్పిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఆరుగురువిద్యార్థుల శవాలు మానేరు డ్యామ్‌లో దొరికాయి. ఒకవిద్యార్థిని శవంతో పాటు మరో ఐదుగురు విద్యార్థుల శవాలు దొరికాయి.

ఒక మాజీ విద్యార్థి, డ్రైవర్‌, మరోవిద్యార్థి జాడ తెలియడం లేదు. వీరి జాడ కోసం గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.శ్రీరాంసాగర్‌ వరద కాలువ నీటిని తగ్గించి గజ ఈతగాళ్లు గాలింపు జరుపుతున్నారు. మారుతీవ్యాన్‌లో ప్రయాణిస్తున్నవిద్యార్థులు నీళ్లలో ఎలా పడ్డారనే విషయం తేలడం లేదు. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఎం కళాశాలకు చెందిన 28 మందివిద్యార్థులు బాసర పుణ్యక్షేత్రానికి మూడు వాహనాల్లో వెళ్లారు. తిరిగి వస్తుండగా మారుతీ వ్యాన్‌ డాబా వద్ద ఆగి ఉండడం చూశామనిమిగతా వాహనాల డ్రైవర్లు, వాటిలోని విద్యార్థులు చెబుతున్నారు. మారుతీ వ్యాన్‌లోని విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్లు కూడా చెబుతున్నారు. చనిపోయినవిద్యార్థుల శవాలపై గాయాల గుర్తులు లేవు. వీరు ప్రయాణించిన మారుతీ వ్యాన్‌ జాడతెలియడం లేదు. వ్యాన్‌ జాడ తెలిస్తే మిస్టరీ విడిపోగలదని పోలీసులు భావిస్తున్నారు.విద్యార్థుల మృతికి సంతాపసూచకంగా కరీంనగర్‌విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X