వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛోటారాజన్‌ అనుచరుడి ఎన్‌కౌంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: పేరు మోసిన అండర్‌వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ గ్యాంగ్‌ సభ్యుడొకడు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్య ముంబాయిలోని మహాలక్ష్మి వద్ద గురువారం రాత్రి ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు పోలీసులు చెప్పారు.

ఒక మిత్రుడ్ని కలవడానికి ఛోటా రాజన్‌ అనుచరుడు సంతోష గజానన్‌ రానే మహాలక్ష్మి వంతెన వద్దకు వస్తున్నట్లు పోలీసులకు సమాచారంఅందింది. దీంతో టార్డియో పోలీసులు గురువారం రాత్రి 10 గంటలకు అక్కడకు చేరుకున్నారు. రానేను గుర్తించి లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రానే కాల్పులు ప్రారంభించాడు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులకు పూనుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో రానే తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని నాయర్‌ ఆస్పత్రికి తరలించారు. అతను మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. అతని నుంచి ఒక పిస్టల్‌ను, నాలుగు లైవ్‌ కాట్రడ్జిజ్‌లను, పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. హత్య, బలవంతపు వసూళ్లు, దోపిడీలకు సంబంధించి రానేపై 12 కేసులున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X