వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కండోమ్‌ లతో హైదరాబాద్‌ కళకళ!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురష్కరించుకొని రాష్ట్రప్రభుత్వం భారీ ఎత్తున నగరంలో ప్రచారం చేసింది. అన్ని ప్రధాన రోడ్లపై ఎయిడ్స్‌ పై అవగహనతో కూడిన బ్యానర్లు, పోస్టర్లను నింపారు. ప్రధాన కూడళ్ళలో భారీసైజ్‌ కండోమ్‌ లను ఏర్పాటు చేశారు. నెక్లెస్‌ రోడ్‌ ను పూర్తిగా ఎయిడ్స్‌ మెటిరీయల్‌ తో అలంకరించారు.

తెలుగు సినిమా స్టార్‌ నటించిన కొత్త చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసే కటౌట్ల మాదరిగా భారీ కండోమ్‌ కటౌట్‌ లను బషీర్‌ బాగ్‌ లో ఏర్పాటు చేశారు. నగరంఅంతా ఎయిడ్స్‌ బ్యానర్లే. ఎయిడ్స్‌ రోగుల సంఖ్యలో దేశంలో రాష్ట్రానిది ద్వితీయ స్థానం. ఈ నేపథ్యంలో ఈసారి ఎయిడ్స్‌ దినోత్సవాన్ని భారీ ఎత్తున్న నిర్వహించారు. గ్రామగ్రామాల్లో చైతన్య సదస్సులు, కార్యక్రమాలను నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X