• search

అంతటా గుజరాత్‌ ప్రతిఫలిస్తుంది: వెంకయ్య

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    న్యూఢిల్లీ: గుజరాత్‌ అనుభవాన్ని తమ పార్టీ ప్రతిచోట ప్రతిబింబింపజేస్తుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు అన్నారు. తన నాయకత్వ నేపథ్యంలో కాంగ్రెస్‌ తిరిగి బలం పుంజుకుంటోందనే భ్రమను గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు బద్దలు కొట్టాయని ఆయన అన్నారు. రెండు రోజుల పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశంలో ఆయన సోవామరం ప్రారంభోపన్యాసం చేశారు.

    రాజకీయ ప్రేరేపిత లౌకికవాదం పేరుతో కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంభించడాన్ని దేశ ప్రజలు సహించబోరనే సందేశాన్ని స్పష్టంగా ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలనువిజయ స్వరూపాన్ని, పరిమాణాన్ని బట్టే కాకుండా హిందూత్వ వ్యతిరేక, హిందూ వ్యతిరేక ప్రచారవిషస్వభావాన్ని బట్టి కూడా గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు.

    గుజరాత్‌ విజయంతో బిజెపి విజయ పర్వం మొదలైందని, 2003లో జరిగే వివిధ రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2004 పార్లమెంటు ఎన్నికల్లోనూ పార్టీవిజయదుందుభి మోగిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

    పార్టీ తన సాంస్కృతిక జాతీయవాద సిద్ధాంతంవిషయంలోనూ, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ఉమ్మడి ఎజెండాకు కట్టుబడేవిషయంలోనూ క్షమాపణాపూర్వక ధోరణిని అవలంభించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సంతోషపెట్టే మైనారిటీవాదంవిషయంలోనూ, మైనారిటీలకు చేసిన అన్యాయంవిషయంలోనూ కాంగ్రెస్‌ సుదీర్ఘ రికార్డును గుర్తించి పరస్పర అవగాహన చట్రంలోకి రావాలని ఆయన మైనారిటీలకు పిలుపునిచ్చారు. వోటు బ్యాంక్‌ రాజకీయాలు మైనారిటీలకు లెక్కలేనంత నష్టం చేశాయని, ఈవిషయాన్ని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. గోద్రా సంఘటననే కాకుండా గోద్రా అనంతర హింసను కూడా బిజెపి ఖండించిందని ఆయన గుర్తు చేశారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more