అరెస్టులతో ఆల్-బదర్ కుట్ర భగ్నం
జమ్మూ: పాకిస్థాన్‌కు చెందిన ఆల్-బదర్ తీవ్రవాద సంస్థ జమ్మూ నగరంలోపెద్ద యెత్తున దాడికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఐదుగురు తీవ్రవాదులనుఅరెస్టు చేయడం ద్వారా ఆ కుట్రను భగ్నం చేసినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి.అరెస్టయినవారిలో ఒక పాకిస్థానీ జాతీయుడు, ఒక మహిళ ఉన్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జెలూం జిల్లా కాలా గుజ్రాన్ గ్రామానికి చెందిన అజర్ హుస్సేన్ అలియాస్ అబు డానిష్ అలియాస్ మొహ్మద్ ఇక్బాల్, అతని అనుచరురాలు 22 యేళ్లవివాహిత స్త్రీ గుల్జార్ బీబీని రఘునాథాలయానికి వందమీటర్ల సమీపంలోని ఒక హోటల్లో అరెస్టు చేశారు.వీరి అనుచరులు అబ్దుల్ ఖయూం, నజీర్ అహ్మద్ (ఈ ఇద్దరు షాప్కీపర్లు), జాఫర్ ఇక్బాల్‌లను రాజౌరీ జిల్లాలోఅరెస్టు చేశారు.
వీరి నుంచి ఒక ఎకెఅసాల్ట్ రైఫిల్‌ను, నాలుగు మాగజీన్లను, 200 రౌండ్లనుస్వాధీనం చేసుకన్నారు. సోదాలు ఇంకా జరుగుతున్నాయి. నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో ఈ తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పథకం వేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
తమ మొదటి గురి సచివాలయమేనని అజర్ హుస్సేన్ ఇంటరాగేషన్‌లో వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. గుల్జార్ బీబీ అజర్ భార్యగా నటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా దంపతులమనే భ్రమను కలిగించడానికిఅంగీకరించినట్లు సమాచారం. ఆయుధాలను తన ఇంటిలోని ఆవుపేడలో దాచడం ద్వారా గుల్జార్ బీబీ అతనికి సహకరించింది. గుల్జార్ బీబీ ఏడాది క్రితంవివాహమాడిన అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి గత ఎనిమిది నెలలుగా ఆల్ బదర్ కోసం మని చేస్తున్నట్లు సమాచారం.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!