వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పన్ను మినహాయింపు పరిమితి పెంపు
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయం పన్ను పరిమితినిపెంచాలని కేల్కర్ కమిటీ సిఫారస్ చేసింది. లక్ష రూపాయల లోపు వార్షికాదాయం ఉన్న వారిని పన్ను ఛత్రం నుంచిమినహాయించాలని విజయ్ కేల్కర్ సిఫారసు చేశారు.
ప్రత్యక్ష పన్నులపై ఏర్పాటైన కమీషన్ తన సిఫారసులను కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించింది. గృహరుణాలపై వడ్డీపైఇచ్చే రిబేట్ ను కూడా తగ్గించాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న 1,50,000 రూపాయల నుంచి 50 వేలకు తగ్గించాలనిపేర్కొంది. లిస్టెడ్ కంపెనీల దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పై విధించే పన్నును రద్దు చేయాలని, వ్యక్తిగత వార్షిక ఆదాయం 60 వేలు దాటిన వారిపై ప్రస్తుతం విధిస్తోన్న 5 శాతం సర్ ఛార్జిని కూడా రద్దు చేయాలని సూచించింది.
Comments
Story first published: Friday, December 27, 2002, 23:53 [IST]