వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండో వన్డేకు సచిన్ డౌటే!
నేపియర్: న్యూజిలాండ్ తో ఆదివారం జరగనున్న రెండో వన్డేకు కూడా సచిన్అందుబాటులో ఉండడమే కష్టమే. గాయంతో బాధపడుతోన్న సచిన్ రెండో వన్డే నాటికి కూడా ఫిట్ నెస్ లోకి రావడం కష్టమేనని తెలుస్తోంది.
సచిన్ కు అన్ని వైద్య పరీక్షలుచేశాం. కానీ ఫిజియో థెరఫిస్ట్ అండ్రూ లీపస్ సచిన్ మోకాలివిషయంలో ఇంకా సందేహాలు వ్యక్తం చేస్తున్నాడని టీం మేనేజర్ ఎన్.ఆర్.చౌదరి శుక్రవారంవిలేకరులకు తెలిపారు.ౖ
మరోవైపు, గాయాలతో తొలి వన్డేలో పాల్గొనని హర్భజన్ సింగ్ పూర్తిగా కోలుకున్నాడు. హర్భజన్ రెండో వన్డేలో ఖాయంగా ఆడుతాడని చౌదరి చెప్పారు. సంజయ్ బంగర్ పరిస్థితి కూడా మెరుగుపడింది. మహమ్మద్కైఫ్ ఫిట్ నెస్ కూడా ఓకేనని అన్నాడు. వన్డేలో 1-0తో లీడింగ్ లో ఉన్న కివీస్ రెండో వన్డేవిజయంపై కూడా ధీమాగా ఉంది.
Comments
Story first published: Friday, December 27, 2002, 23:53 [IST]