• search

కులవివక్ష- విద్యార్థుల అస్వస్థత

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌: బడి పిల్లల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజన పథకంలో శుక్రవారం రెండో రోజు కూడా అపశృతులు దొర్లాయి. కుల వివక్ష, విద్యార్థులు అస్వస్థులు కావడం ఈ పథకం అమలులో ప్రధాన సమస్యలుగా ముందుకు వస్తున్నాయి.

    దాదాపు పది పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఆరగించిన పిల్లలుఅస్వస్థులయ్యారు. దళితులు వండిన వంటకాలను తమ పిల్లలు తినరంటూ కొన్నిచోట్ల అగ్రవర్ణాలవారు మొండికేశారు. విశాఖపట్నం జిల్లాకంచెరపాలెంలో మధ్యాహ్న భోజనం తిన్నఐదుగురు పిల్లలు అస్వస్థులయ్యారు. నల్లగొండ జిల్లా భువనగిరిలోను, ఏలూరులోనూ ఇదే పరిస్థితి.విశాఖపట్నం జిల్లా కంచెరపాలెంలో 150 మంది విద్యార్థులు వాంతులు,విరేచనాలతో బాధపడ్డారు. కొందరు పిల్లలకుకళ్లు తిరిగాయి. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకుదిగారు. ఖమ్మం జిల్లా దమ్మపేటలో 35 మందిబడిపిల్లలు అస్వస్థులయ్యారు. ఏలూరులో మధ్యాహ్న భోజనం తిని 13మంది పిల్లలు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. తిరుపతిలో 30మంది పిల్లలు అస్వస్థులయ్యారు. దీంతో ఇక్కడవిద్యార్థుల తలిదండ్రులకు, అధికారులకు మధ్య ఘర్షణచెలరేగింది.

    కరీంనగర్‌, వరంగల్‌జిల్లాల్లో కులవివక్ష పెద్ద సమస్యగా ముందుకువచ్చింది. దళితులు వంటలు చేస్తే తన పిల్లలు మధ్యాహ్న భోజనం తినబోరంటూఅగ్రవర్ణాలవారు కరీంనగర్‌ జిల్లాలోని రామగుండం,హుస్నాబాద్‌, తదితర ప్రాంతాల్లో ఆందోళనకుదిగారు. ఇలాగే కొనసాగితే తమ పిల్లలనుబడికి మాన్పిస్తామని వారు చెప్పారు. వరంగల్‌ జిల్లాలోని కొన్నిచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో దళితులనుఅవమానించారంటూ కుల నిర్మూలన సంఘం కార్యకర్తలు ఆందోళనకుదిగారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more