• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుడి కోసం కాంగ్రెస్‌కు విహెచ్‌పివిజ్ఞప్తి

By Staff
|

భువనేశ్వర్‌: అయోధ్యలోరామాలయ నిర్మాణం చేపట్టేందుకు వీలుగాపార్లమెంటులో చట్టం చేయడానికి ప్రధానరాజకీయ పార్టీలు సహకరించాల్సిన సమయంవచ్చిందని విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి)అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ భాయ్‌ తొగాడియాఅన్నారు.

రామాలయ నిర్మాణం అంశాన్ని గతంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) బలపరిచిందని, ఇప్పుడు ఆ పార్టీ వైఖరి స్పష్టంగా లేదని ఆయన ఆదివారంవిలేకరలతో అన్నారు. ఈ విషయంలో సోనియాగాంధీ తన పార్టీ సహకారాన్నిఅందించాలని ఆయన కోరారు. రెండు ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌ సహకరిస్తే రామాలయం ఎన్నికలఅంశం కాబోదని, సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని ఆయన అన్నారు.

భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మల్చే తమ కృషిలోవిజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రామాలయ నిర్మాణంవివాదంలో కోర్టు నిర్ణయానికి తాను వ్యతిరేకం కాదని, అయితేవిశ్వాసానికి సంబంధించిన వివాదాన్ని న్యాయవ్యవస్థ పరిష్కరించలేదని ఆయన అన్నారు.

రామాలయ నిర్మాణం గురించి చర్చించేందుకు ఫిబ్రవరి 22 నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో ధర్మసంసద్‌ జరుగుతుందని తొగాడియా చెప్పారు. లౌకికవాదులుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌, బిజెపిలుజిహాదీ ఉగ్రవాదాన్ని అంతం చేయలేరని, హిందూ రాజ్యం మాత్రమే దాన్ని పరిష్కరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X