వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్ర వక్రీకరణల సవరింపు: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: చరిత్ర పుస్తకాలనుతిరగరాయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలపైవిమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి తీవ్రంగా ధ్వజమెత్తారు. విద్యార్థులుసరైన విద్యాదృక్కోణాన్ని పొందగలిగారని ఆయనఅన్నారు.

ఏళ్ల తరబడి వారు చరిత్రకు వక్రభాష్యాలుచెప్పారు. ఇప్పడు మేము చరిత్రను సరైనదృక్కోణంలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటే విమర్శిస్తున్నారు అనిఆయన అన్నారు. వివేకానంద ఎడ్యుకేషన్‌ సొసైటీహషు అద్వానీ స్మారక సముదాయానికి ఆయన సోమవారం శంకుస్థాపనచేశారు. విద్యను ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అయితేవనరులు, ఇతర సౌకర్యాల కొరత అడ్డంకిగా మారాయనిఆయన అన్నారు.

కేవలం వనరుల కొరత మాత్రమే కాకుండా అంకితభావం,నిశ్చయం లేనట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు.నిస్వార్థ, దేశభక్త బోధకులు ముందుకువచ్చి భారతదేశంలో విద్యకు తగిన స్థానంకల్పించాల్సిన అవసరం ఉన్నదని వాజ్‌పేయి అన్నారు.

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం అంతరిక్షపరిశోధనలకే కాకుండా వ్యవసాయ, సంబంధితరంగాల్లో కూడా వాడాల్సి వున్నదని ఆయనచెప్పారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మకమార్పుల ద్వారా రైతులు లాభపడాలని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X