సింగూరు కాదు, కృష్ణాజలాలు కావాలి
హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు వెంటనే కృష్ణాజలాల రప్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సింగూరు జలాశయం నుంచి నీరు తెప్పించాలన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు బుధవారం హైదరాబాద్ లో భారీ ర్యాలీని నిర్వహించారు. నగరానికి కృష్ణా జలాలను తీసుకురావడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ద లేదని రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారయణ రావు విమర్శించారు.
ఈ వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. భారీగా నిర్వహించిన ఈ ర్యాలీని పోలీసులు సచివాలయం వద్ద అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఘర్షణ చెలరేగింది. అయితే, కొందర్ని మాత్రం రాజ్ భవన్ వరకు అనుమతించడంతో రభస సద్దుమణిగింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!