• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐదుగురు అయ్యప్ప భక్తుల మృతి

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌ - బెంగుళూర్‌ జాతీయ రహదారి మృత్యు రహదారిగా మారింది. గత మూడు నెలల్లో 25 మందిని పొట్టన బెట్టుకొన్న ఈ రహదారిపై గురువారం మరోఘోర ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్‌ నుంచి శబరిమలకు ప్రయాణిస్తోన్న అయ్యప్పభక్తుల టాటా సుమోను ఓ లారీ ఢీకొంది. ఐదుగురుఅక్కడికక్కడే మృతి చెందారు. అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మహబూబ్‌ నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం ఫరిధిలోని రాజానగర్‌ వంతెన వద్ద గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బెంగుళూర్‌ నుంచి వస్తోన్న లారీవీరు ప్రయాణిస్తోన్న టాటా సుమోను ఢీకొంది. లారీ చాలా వేగంగా వస్తుండడంతో అది పూర్తిగా టాటా సుమోలోకి దూసుకుపోయింది.

సుమో పూర్తిగా నుజ్జునుజ్జుఅయింది. కనకయ్య(27), భాస్కర్‌ రెడ్డి(35), లక్ష్మణరావు(45), రాఘవరావు(40), రాములు(30)లు మరణించిన వారిగా గుర్తించారు. డ్రైవర్‌ మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తొలుత జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్‌ లోని నిమ్స్‌ కు తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X