• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కన్ను లొట్టబోయి గెల్చిన భారత్‌

By Staff
|

ఆక్‌లాండ్‌: న్యూజిలాండ్‌పై భారత్‌ ఆరవ వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో కష్టపడి గెలిసింది. చాలా సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌ను భారత్‌ అతి కష్టం మీద గెలుచుకుంది. సెహవాగ్‌ సెంచరీ చేసినప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్‌ సమయస్ఫూర్తితో ఆడడంలో విఫలం కావడంతో కష్టాలను కొన తెచ్చుకున్నట్లయింది. దీంతో కేవలం ఒక వికెట్‌తో తేడాతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు విజయాన్ని అందుకుంది.

టాస్‌ గెల్చిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌ బౌలర్లు ముఖ్యంగా జువగళ్‌ శ్రీనాథ్‌ న్యూజిలాండ్‌ బౌలర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. న్యూజిలాండ్‌ 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. విన్సెంట్‌ 53 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. స్కాట్‌ స్టిరిస్‌ వీరోచితంగా ఆడి 52 బంతుల్లో 42 పరుగులు చేసి స్కోరును వేగంగా పెంచాడు. శ్రీనాథ్‌ పది ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌ పెట్టిన 200 పరుగులు లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ మొదట చక్కటి ఆటను ప్రదర్శించింది. కెప్టెన్‌ గంగూలీ, వీరేంద్ర సెహవాగ్‌ మంచి ప్రారంభాన్ని అందించారు. వీరు మొదటి వికెట్‌ భాగస్వామ్యానికి 70 పరుగులు సాధించారు. గంగూలీ 23 పరుగులకు అవుటయ్యాడు. సెహవాగ్‌ మునుపటి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. అతను మూడు సిక్సర్లు, 11 ఫోర్లతో 112 పరుగుల చేశాడు. అతనికి ఈ సిరీస్‌లో ఇది రెండో సెంచరీ.

ఒకానొక సందర్భంలో 42 ఓవర్లలో 182 పరుగులు చేసి నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్‌ కష్టాలను కొని తెచ్చుకుంది. యువరాజ్‌ సింగ్‌ అవుటైన వెంటనే వరుసగా వికెట్లను కోల్పోయి భారత్‌ కష్టాల్లో పడింది. ఓటమి ఖాయమనే స్థితికి చేరుకుంది. అగార్కర్‌, జహీర్‌ఖాన్‌ అవనసరంగా రన్నవుటయ్యారు. అయితే వారి మీద ఉన్న ఒత్తిడి అటువంటిది. చివరగా రెండు బంతుల్లో ఒక పరుగు చేయాల్సిన అగత్యంలో నెహ్రా మీద భారత్‌ను గెలిపించాల్సిన బాధ్యత పడింది. అతను తన బాధ్యతను నిర్వర్తించి భారత్‌ను గెలిపించాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more