వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జన్మభూమి సక్సెస్: ముఖ్యమంత్రి
హైదరాబాద్: 18వ విడత జన్మభూమి దారుణంగా ఫెయిలందని వస్తోన్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిప్పికొట్టారు. అన్ని జన్మభూమిల కన్నా బలహీన వర్గాల జన్మభూమే పెద్ద సక్సెస్ అయిందని ఆయన ఆదివారం అన్నారు. కాంగ్రెస్, సీపిఎంల విమర్శల్లో నిజం లేదన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు అంటూ కాంగ్రెస్ అనవసరంగా రాద్దాంతం చేస్తుందని ఆయన విమర్శించారు.
విద్యార్థుల కడపుకొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ సారి జన్మభూమిలో 8లక్షల 80 వేల ఫిర్యాదులు అందాయని తెలపారు. వాటినన్నింటిని పరిశీలించి అన్నింటిపై చర్య తీసుకుంటామని సీఎం తెలియచేశారు. ప్రతివారికి తిరిగి ఉత్తరాలు పంపించి సమస్య పరిష్కారం ఎక్కడివరకు వచ్చిందో తెలియచేస్తామన్నారు. ఈ సారి తాను 15 జిల్లాల్లో జన్మభూమి కార్యక్రమాల్లో పర్యటించానని, అంతటా ప్రజల్లో భారీగా స్పందన వచ్చిందన్నారు.