వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్మభూమిలో లోపాలను సవరించాలి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: 18 విడతలుగా సాగిన జన్మభూమి సాధించినదేమిటో అవలోకనం చేసుకోవాలని రాష్ట్ర సీపీఎం శాఖ ప్రభుత్వానికి సూచించింది. జన్మభూమిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించింది. బాబు దీన్నో ఓ పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నా..ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతుండడాన్ని బట్టి అంతా సక్రమంగా లేదని తెలుస్తుంది కదా అని ఆ పార్టీ నేత బి.వి.రాఘవులు ఆదివారం హైదరాబాద్‌ లో విలేకరులతో అన్నారు.

అన్ని పార్టీలు, స్వచ్చంధ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి జన్మభూమిని సమర్ధంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సారి జన్మభూమిలో అధికంగా ఇళ్ళ స్థలాలు, రేషన్‌ కార్డులు..వంటి అంశాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయని, వాటిని ఇకనైనా వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలోని అన్ని సబ్‌ స్టేషన్‌ లను ప్రైవేటికరించాలని ప్రభుత్వం యోచిస్తుందనీ, దీన్ని నిరసిస్తూ ఈ నెల 19న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X