వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దమ్ముంటే భారత్ ను తొలగించండి
న్యూఢిల్లీ: కాంట్రాక్ట్ సమస్యపై భారత్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా ఒక్క మెట్టు దిగేందుకు కూడా నిరాకరించారు. ఐసిసికి ధైర్యముంటే భారత జట్టును ప్రపంచకప్ నుంచి తొలగించి చూడమనండని ఆయన ఆదివారం సవాల్ విసిరారు. ఐసిసి కాంట్రాక్ట్ ఒప్పందంపై భారతీయ క్రికెటర్లు కండీషన్ మీద సంతకం చేశారు.
ఒప్పందాల్లోని క్లాజ్ లను వ్యతిరేకిస్తూ సంతకం చేశారు. ఒకవేళ ఐసిసికి క్రికెటర్ల కండీషన్ ఆమోదయోగ్యం కాకపోతే ఎలా అని ప్రశ్నించగా, జట్టును తొలగించే అధికారం ఐసిసికి లేదని ఆయన అన్నారు. ధైర్యముంటే తొలగించి చూడమనండని ఆయన సవాల్ విసిరారు.