వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగార్జునలో కోతుల సందడే సందడి

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలు గ్రీన్‌ జోన్‌ లుగా వెలుగొందుతున్నాయి. ఉస్మానియా, సెంట్రల్‌ యూనివర్శిటీలు దాదాపు అడవుల్లుగానే ఉండగా, ఆంధ్రా, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో ఇటీవల కాలంలో చెట్లను బాగా పెంచుతున్నారు. పకృతితో శోభిస్తూ విద్యార్థులకు ఆహ్లాదాన్ని కల్గిస్తూ చదవుకు పురికొల్పాలని దీని వెనుక ఉద్దేశం. అయితే, నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రకృతే కొత్త సమస్యలను తీసుకొస్తోంది.

గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయ క్యాంపస్‌ లో కోతుల సందడి ఎక్కువైంది. విద్యార్థుల టిఫిన్‌ బాక్స్‌ లను ఎత్తుకుపోవడం, విద్యార్థులను దారిలో అటకాయించడం వంటి పనులతో కోతులు కోతిపనులు చేస్తున్నాయి. ఈ కోతి చేష్టలు వినోదాన్ని ఇచ్చినా, విద్యార్థునులు ప్రధానంగా భయపెట్టిస్తున్నాయి.

ఈ మధ్య ఒక విద్యార్థిని జుట్టు అంతా పీకి ఆ అమ్మాయిని ఓ కోతి భయపెట్టింది. విద్యార్థులు విశ్వవిద్యాలయ యజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కోతులను ఎలా తరమికొట్టాలో యజమాన్యానికి తెలియడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X