వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గాజువాకలో కపిల్ గల్లీ క్రికెట్
విశాఖపట్నం: ఎంతటి పెద్ద క్రికెట్ ఆటగాడైన గల్లీ(సందు)లోనే ఓనమాలు నేర్చుకోవాలి. భావి క్రికెటర్లకు మెళకువలు నేర్పేందుకు నడుంకట్టిన విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ కపిల్ దేవ్ ప్రస్తుతం విశాఖపట్నం సందుల్లో క్రికెట్ ఆడుతున్నాడు. ఆదివారం గాజువాకలోని గల్లీలలో చిన్నపిల్లలుతో క్రికెట్ ఆడుతూ..పిల్లలకు బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ మెళకువలు నేర్పాడు. రండి..మనం క్రికెట్ ఆడుదాం.. అంటూ పిల్లలను హుషార్ చేశాడు.
నన్ను ఔట్ చేస్తే..దక్షిణాఫ్రికాకు ఫ్రీగా తీసుకెళతాను అంటూ పిల్లలకు ఛాలెంజ్ వేశాడు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ..ఈ టూర్ వాణిజ్యపరమైనదే అయినప్పటికీ తన కోచింగ్ నిజమైనదేనని అన్నారు. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏ క్రికెటర్ ను చూడలేదు. అందుకే పిల్లలకు నిజమైన క్రికెట్ మెళకువలు నేర్పాలనుకుంటున్నాని తెలిపాడు.