• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ ఇప్పుడు అప్రస్తుతం: బీజేపీ

By Staff
|
హైదరాబాద్‌: 2004 తర్వాత ప్రత్యేక తెలంగాణ గురించి బీజేపీ మాట్లాడుతుందని, ప్రస్తుతం ఈ అంశం గురించి పట్టించుకోదల్చుకోలేదని కేంద్రహోం శాఖ సహాయమంత్రి సి.ఎచ్‌.విద్యాసాగర్‌ రావు అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బిజెపి కట్టుబడి ఉన్నప్పటికి ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దీని గురించి వ్యాఖ్యానించబోమని ఆయన సోమవారం హైదరాబాద్‌ లో విలేకరుతో అన్నారు.

మరోవైపు, సిపిఐ నేత ఏ.బి.బర్ధన్‌ కూడా సమైకాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. హైదరాబాద్‌ పర్యటన నిమిత్తం వచ్చిన బర్దన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..తెలంగాణ నిర్లక్ష్యానికి గురైన మాట వాస్తవమే. అయితే, ప్రత్యేక తెలంగాణ మాత్రం మేం కోరుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి ప్రస్తుతం శాసనసభలో ప్రాతినిధ్యం లేకున్నా, వచ్చే ఎన్నికల్లో రెండంకెల సీట్లు కైవసం చేసుకోగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X