వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్ లో గంజాయి పట్టివేత
వరంగల్: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పరిసరాల్లోని ఓ గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున పండిస్తోన్న గంజాయిని పట్టుకున్నారు. మంగళవారం వరంగల్ పోలీసులు ఈ ప్రాంతంలో రెయిడ్ చేయగా దాదాపు కోటి రూపాయల విలువ చేసే గంజాయి లభించింది. పత్తి పంటలో భాగంగా రహస్యంగా గంజాయిని సాగుచేస్తున్నారు. ఎండబెట్టిన గంజాయి మొత్తాన్ని పోలీసులు అక్కడే కాల్చివేశారు.
వరంగల్ అడవుల్లో గంజాయి సాగు విస్తృతంగా సాగుతోన్న పోలీసుల కంటపడుతున్నది చాలా తక్కువ. నక్సల్స్ బెడద తగ్గుముఖం పడుతుండడంతో వరంగల్ పోలీసులు ఇప్పుడు గంజాయి పంటసాగుపై దృష్టిపెట్టారు.
Comments
Story first published: Tuesday, January 14, 2003, 23:53 [IST]