వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగుళూరులో బాబు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఆధ్యాత్మిక జీవనం వల్లే సమాజంలో శాంతిభద్రతలు పరిఢవిల్లుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆధునిక జీవితపు ఒత్తిడుల నుంచి దూరంగా ప్రశాంతంగా జీవనం సాగించాలంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవనవిధానాన్ని పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బెంగుళూర్‌ లోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ ఆశ్రమంలో ఆదివారం ప్రారంభమైన ప్రపంచ ఆధ్యాత్మిక సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సభల్లో ఆయన ప్రసంగించడమే కాకుండా శ్రద్దగా ఇతర గురువుల ఆధ్యాత్మిక బోధనలను ఆలకించారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అంటే ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ద అన్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు రాజకీయాలకన్నా దేశాభివృద్ది, వ్యక్తిగతాభివృద్దిపైనే దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వంటి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవర్చుకున్నప్పుడే స్వార్థ రాజకీయాలు వీడే అవకాశం ఉంటుందని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X