• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెనడా ఆస్కార్స్‌ కు బాలీవుడ్‌, హాలీవుడ్‌

By Staff
|
న్యూఢిల్లీ: కెనడియన్‌ ఆస్కార్స్‌ గా భావించే ప్రతిష్టాత్మక జెనీ అవార్డ్సుకు దీపామెహతా రూపొందించిన బాలీవుడ్‌-హాలీవుడ్‌ చిత్రం ఎంపికైంది. వ్యంగ్యధోరణిలో రూపొందించిన ఈ చిత్రం ఏడు నామినేషన్లు పొందడం విశేషం. భారతీయులరాలైన దీపామెహతా ఫైర్‌ చిత్రంతో దేశంలో సంచలన దర్శకురాలిగా పేరొందారు.

భారతదేశంలో బాలీవుడ్‌-హాలీవుడ్‌ చిత్రాన్ని విమర్శకులూ, ప్రేక్షకులూ తిప్పికొట్టారు. అయినప్పటికీ కెనడా, ఇతర పాశ్చత్య దేశాల్లో ఈ చిత్రానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ ప్లే, ఉత్తమ సహాయ నటి, నటుడు వంటి కేటగిరీలలో ఈ చిత్రం నామినేట్‌ అయింది. విజేతల వివరాలు ఫిబ్రవరి 13న ప్రకటిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X