వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పులు తేవడం తప్పదు: యనమల

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: 2005 వరకు రాష్ట్రప్రభుత్వం అప్పులు తీసుకురావడం తప్పదని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారం 2003- 2004 ముసాయిదా బడ్జెట్‌ విడుదల సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పెరుగుతోన్న అప్పుల భారాన్ని ఎలా నియంత్రించనున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ..అప్పులు అభివృద్ధి కోసమే చేస్తున్నాం. కాబట్టి మరో రెండేళ్ళు ఇంకా అప్పులు చేయకతప్పదని తెలిపారు. ఈ ఏడాది 54 వేల కోట్ల రూపాయలు అప్పు చేయనున్నారు.

అయితే, ఈ రుణాన్ని అనుత్పాదక రంగాల్లో పెట్టుబడి పెట్టడం లేదని వివరించారు. అప్పు తేవడం తప్పక పోయినా, తగ్గించుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X