వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్డేల నుంచి వార్న్‌ రిటైర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

సిడ్ని: ఆస్ట్రేలియా స్పిన్‌ మాంత్రికుడు షేర్న్‌ వార్న్‌ వన్డే క్రికెట్‌ మ్యాచ్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వేలలో జరిగే ప్రపంచ కప్‌ తర్వాత తాను రిటైర్‌ అవుతానని ఆయన బుధవారం చెప్పారు.

మూడు దేశాల వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం ఇంగ్లాండుతో జరిగే మ్యాచ్‌లో పాల్గొనడానికి ఆస్ట్రేలియా జట్టుతో ఆయన ఇక్కడికి వచ్చారు. గత నెల ఆయన కుడి భుజానికి గాయమైంది. ఈ గాయం నుంచి ఆయన కోలుకుంటున్నారు. వార్న్‌ కుడిచేతితోనే బౌలింగ్‌ చేస్తారు. టెస్ట్‌ క్రికెట్‌లో ఆడడానికే వన్డే మ్యాచ్‌ల నుంచి రిటైర్‌ కావాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఆస్ట్రేలియా కోసం క్రికెట్‌ ఆడడాన్ని తాను ఇష్టపడతానని, కానీ తన ప్రథమ ప్రాధాన్యం టెస్ట్‌ మ్యాచ్‌లకేనని ఆయన చెప్పారు. 191 వన్డే మ్యాచ్‌ల్లో ఆయన 288 వికెట్లు తీసుకున్నారు. ఆయన 107 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 491 వికెట్లు పడగొట్టాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X