• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పట్టాలు తప్పిన మరో రైలు

By Staff
|

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ప్రయాగరాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్యాసింజర్‌ కోచ్‌ శుక్రవారం తెల్లవారు జామున పట్టాలు తప్పింది. మైథా స్టేషన్‌ గుండా పోతున్న ఈ రైలు కాన్పూర్‌ సమీపంలో పట్టాలు తప్పింది. అయితే ప్రాణనష్టమేమీ సంభవించలేదు.

మైథా వద్ద ఒక కోచ్‌ అసాధారణంగా కదులుతుండడాన్ని స్టేషన్‌ మాస్టర్‌ గులాం ఖాద్రీ గమనించి రెడ్‌ సిగ్నల్‌ చూపి రైలును ఆపాలని సూచించినట్లు, ఇంజన్‌ నుంచి 16వ బోగీ ట్రాక్‌ నుంచి పడిపోయినట్లు ఉత్తర రైల్వే అధికారులు చెప్పారు. వెంటనే కాన్పూర్‌ నుంచి వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరినట్లు, సహాయక చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. పట్టాలు తప్పిన కోచ్‌లోని ప్రయాణికులను ఇతర కోచ్‌లకు పంపారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X