వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పిఎం సెక్యూరిటిలోకి చొరబాటు
న్యూఢిల్లీ:
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్‌పేయి
భద్రతావలయంలోకి
ఒక
మోటారు
సైకిల్
దూసుకొచ్చింది.
భద్రతావలయంలోకి
ఆగంతుకులు
దూసుకురావడం
మూడు
రోజుల్లో
ఇది
రెండోసారి.
దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ప్రధాని కాన్వాయ్‌లోకి గురువారం ఉదయం ఈ మోటార్ సైకిల్ దూసుకొచ్చింది. ప్రధాని కాన్వాయ్ నిజాముద్దీన్ వంతెన వద్ద ఉన్నప్పుడు మోటార్‌సైకిల్‌పై ఒక యువకుడు కాన్వాయ్‌లోకి సర్రున దూసుకొచ్చాడు. ప్రధాని ఎస్కార్ట్ వాహనానికి అతి సమీపం నుంచి మోటార్ సైకిల్ దూసుకెళ్లింది.
మోటార్ సైకిల్‌పై వచ్చిన యువకుడిని అరెస్టు చేసి నిజాముద్దీన్ పోలీసు స్టేషన్‌కు తీసికెళ్లారు. ఆ యువకుడిని హీరో హోండా ఉద్యోగి అతుల్ త్యాగిగా గుర్తించారు.
Comments
Story first published: Thursday, January 30, 2003, 23:53 [IST]