వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్‌కు కోఫీ అన్నన్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితి: ఇరాక్‌ ఐక్యరాజ్యసమితి తీర్మానానికి కట్టుబడి వుండాలని ఐక్యరాజ్య సమితిసెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ నొక్కి చెప్పారు. ఇరాక్‌లో యుద్ధాన్ని నివారించవచ్చునన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇరాక్‌ ఆయుధ తనిఖీ బృందంతో సహకరిస్తోందా లేదా అనేది భద్రతా మండలి బృందం నివేదిక ఆధారంగా నిర్ణయిస్తుందని ఆయనవిలేకరులతో చెప్పారు. ఇరాక్‌ ఆయుధ తనిఖీ బృందంతో సహరించడం లేదని, ఇరాక్‌ సామూహిక విధ్వంసక ఆయుధాలు కలిగి వున్నదని అమెరికా విదేశాంగ మంత్రి కొలెన్‌ పావెల్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన ప్రతిస్పందిస్తూ ఇరాక్‌ ఆయుధ తనిఖీ బృందంతో సహకరించాలని, అంతర్జాతీయ సమాజం డిమాండ్లను నెరవేర్చాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఇరాక్‌ మనస్ఫూర్తిగా సహకరిస్తే యుద్ధాన్ని నివారించవచ్చునని ఆయన అన్నారు. తాను బగ్దాద్‌వెళ్లే ఆలోచన ఏమీ చేయడం లేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X