వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘంటసాల పోస్టల్ స్టాంప్ విడుదల!
హైదరాబాద్: తెలుగు సినిమా సంగీతం చరిత్రలోనే అత్యంత పాపులర్ సంగీతదర్శకుడు, గాయకుడు ఘంటసాల ఫోటోతో కూడిన పోస్టల్ స్టాంప్ ను పోస్టల్ డిపార్ట్ మెంట్ విడుదల చేయనుంది. ఈవిషయాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు ఘంటసాల రత్నకుమార్ శనివారం హైదరాబాద్ లో తెలియచేశారు.
భారతీయ సినిమా రంగంలో ఏ గాయకుడికీ ఇటువంటి గౌరవం దక్కలేదని ఆయన అన్నారు. తపాలాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 11న ఘంటసాల వర్ధంతి సందర్భంగా నిర్వహించే ఓ భారీ కార్యక్రమంలో ఈ స్టాంప్ ను విడుదల చేయనున్నామన్నారు.
Story first published: Saturday, February 8, 2003, 23:53 [IST]