వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లారా సెంచరీ, విస్టీండీస్‌ జయం

By Staff
|
Google Oneindia TeluguNews

కేప్‌ టౌన్‌: ప్రపంచ వరల్డ్‌ కప్‌ తొలి ఆట ప్రేక్షకులకుపసందైన కనువిందును కలిగించింది.లారా, క్లూసెనర్‌ ల అద్భుతమైన బ్యాటింగ్‌, ఆద్యంతం ఊహించని మలుపులతో ఆట రసవత్తరంగా సాగింది. ఆదివారం వెస్టీండీస్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ లో విండీస్‌ జట్టు మూడు పరుగుల తేడాతోవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ ఓపెనర్లు గేల్స్‌, హిండ్స్‌ లను త్వరగా కోల్పోయింది.

దీంతో బ్రియన్‌ లారా, చందర్‌ పాల్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ ను నిర్మించే బాధ్యత వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను ధాటిగా ఎదుర్కుంటూ...పరుగులను రాబట్టాడు. 30 ఓవర్లకు 109 పరుగుల సాధించిన విండీస్‌ అనంతరంవిరుచుక పడడం విశేషం. చందర్‌ పాల్‌ 34 పరుగులకు ఔట్‌కాగా, బ్రియన్‌ లారా కెప్టెన్‌ హూపర్‌ తో కలిసి పరుగులు వేగంగా రాబట్టాడు.

హూపర్‌ 40 బంతుల్లోనే 40 పరుగులు సాధించాడు. 43.2 ఓవర్ల వద్ద 5వికెట్ల నష్టానికి 198 పరుగుల వద్ద ఉన్న విండీస్‌ స్కోర్‌ రమేష్‌శర్వాన్‌, పొవెల్‌ ఆటతో 50 ఓవర్లు ముగిసే సరికి 278కి చేరుకోవడంవిశేషం. చివరి 10 ఓవర్లో విండీస్‌ ఆటగాళ్ళు 110 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన దక్షిణాఫ్రికా కూడా ధాటిగానే ఆడుతూ..ఇన్నింగ్స్‌ ను ప్రారంభించింది.

అయితే, త్వరత్వరగా వికెట్లు కోల్పోతూ..కష్టాల్లో పడింది. 160 పరుగలకే ఆరువికెట్లు కోల్పోయి..ఆట మీద ఆశలు పోయిన తరుణంలో క్లూసెనర్‌ తన ప్రతాపాన్ని చూపించాడు. బౌండరీలతో హోరెత్తిస్తూ...విండీస్‌ కువిజయాన్ని దూరం చేసేలా కనిపించాడు. గెయిల్‌ బౌలింగ్‌ లోఒకే ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ ను మలుపుతిప్పాడు.

చివరి ఓవర్లో డ్రేక్స్‌ తన బౌలింగ్‌ ప్రతాపంతో క్లూసెనర్‌ నుపెవిలియన్‌ కు పంపి, మరో వికెట్‌ ను కూడా కూల్చడంతో విండీస్‌విజయకేతనం ఎగురవేసింది. సెంచరీ సాధించిన లారాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X