వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్‌ హ్యాట్రిక్‌ - శ్రీలంక విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

పీటర్‌ మారిట్జ్‌ బర్గ్‌: పసికూనలపై శ్రీలంక విరుచుకపడింది. శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ చమిందా వాస్‌ తన బౌలింగ్‌ ప్రతాపాన్ని చూపించాడు. బంగ్లాదేశ్‌ పై శుక్రవారం జరగిన మ్యాచ్‌ లో హ్యట్రిక్‌ సాధించాడు.అరుదైన ఈ రికార్డును సొంతం చేసుకొన్న వాస్‌ తొలి ఓవర్లో నలుగురు బంగ్లాదేశీ బ్యాట్స్‌ మెన్‌ నుపెవిలియన్‌ కు పంపించాడు. వాస్‌ కన్నా ముందు ఇప్పటివరకు వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఇద్దరేహ్యాట్రిక్‌ సాధించారు.

తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన బంగ్లాదేశ్‌ తొలి ఓవర్లోనే నాలుగువికెట్లు కోల్పోవడంతో కోలుకోనంతగా దెబ్బతింది. చివర్లో మొటజామినహా మిగతా బ్యాట్స్‌ మెన్‌ ఎవరూ నిలదొక్కుకొని స్కోర్‌పెంచేందుకు ప్రయత్నించలేదు. 124 పరుగులకే ఆలౌటింది.

అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన శ్రీలంక సునాయసంగా గెలుపొందింది. ఓపెనర్లు మార్వన్‌ ఆటపట్టు, సనత్‌ జయసూర్యలే కార్యాన్ని పూర్తి చేశారు. జయసూర్య, ఆటపట్టు ఇద్దరు అర్థసెంచరీ పూర్తి చేసుకున్నారు. శ్రీలంక 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ పై గెలుపొందింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X