వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసీస్‌ చేతిలో భారత్‌ పరాజయం

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రపంచంలోనే అద్భుతమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన జట్టు మరోసారి చతికిలా పడింది. ప్రపంచంలోనేటాప్‌ జట్టు అవలీలగా గెలిచింది. భారత్‌ - ఆస్ట్రేలియాల మధ్య శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌ ను సింపుల్‌ గా చెప్పాలంటే ఆ రెండు వ్యాక్యాలతో ముగించవచ్చు. కానీ భారత్‌పేలవమైన తీరు, కోట్లాది ప్రజల ఆశలను భారత ఆటగాళ్ళు నీరుగార్చిన తీరు గురించి ఏమని రాయగలం.

భారత్‌ పై ఆస్ట్రేలియా అవలీలగా 9వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ జట్టు త్వరత్వరగావికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ గంగూలీ సిల్లీగా వైడ్‌ బాల్‌ ను కొట్టి స్లిప్‌ లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం చిచ్చరపిడుగువీరేంద్ర సెహ్వాగ్‌ కూడా దూరంగా వెళుతున్న బంతిని కొట్టి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

41 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ ఆటగాళ్లు ఏ దశలోనూ నిలబడేందుకు ప్రయత్నించలేదు. సచిన్‌ ఒక్కడువికెట్ల పతనాన్ని చూస్తూ ఉండిపోయాడు. అనంతరం వచ్చిన ద్రావిడ్‌(1), యువరాజ్‌ సింగ్‌(0),కైఫ్‌(1)లు రెండు పరుగులు మాత్రమే జత చేసిపెవిలియన్‌ దారి పట్టారు. చివర్లో హర్భజన్‌ సింగ్‌(32 బంతుల్లో 28 పరుగులు) కుంబ్లే(16)లు కాస్తా ధాటిగా ఆడి భారత్‌ ను 100 పరుగులు దాటేలా చేశారు.

41.4 ఓవర్లలో భారత్‌ 124 పరుగులకు ఆలౌటింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన ఆస్ట్రేలియా అత్యంత సుళువుగా 22.2 ఓవర్లలో కేవలం ఒక్కవికెట్‌ కోల్పోయి 128 పరుగులు చేసి విజయంసాధించింది. పది ఓవర్లో 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన జేసన్‌ జిలెప్సీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X