కోర్టు తీర్పునకు కట్టుబడాలి: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై కోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆయన సోమవారంప్రసంగించారు.
అయోధ్య వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని లేదా కోర్టు ఇచ్చే తీర్పునకు అన్ని పక్షాలు కట్టుబడి వుండాలని ఆయన అన్నారు.వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం కావడానికి మతపెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు కృషి చేయాలని ఆయన అన్నారు.
జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల సందర్భంగాఅసువులు బాసిన భద్రతా సిబ్బందికి, శాస్త్రవేత్త కల్పనా చావ్లాకు ఆయన నివాళులర్పించారు. ప్రభుత్వం జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్ అక్రమ వలసలనుఅరికట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన అన్నారు. దేశంలో నెలకొన్న తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవడానికి నదుల అనుసంధానమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!