• search

పాలమూరు కరవుపై దద్ధరిల్లిన సభ

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కరువుపై మంగళవారం శాసనసభ దద్ధరిల్లింది. పాలమూరు జిల్లా కరవుపై, కొల్లాపూర్‌ శాసనసభ్యుడు కృష్ణారావుఅరెస్టుపై వెంటనే చర్చ జరగాలని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు.

    కరువుపై చర్చకు ఇచ్చిన వాయిదా తీర్మానాన్నిస్పీకర్‌ కె. ప్రతిభాభారతి తిరస్కరించారు. దీంతో వెంటనే చర్చ జరగాలంటూ కాంగ్రెస్‌ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. స్పీకర్‌తో వాగ్వివాదానికి దిగారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టి పని కల్పించాలని, తద్వారా కూలీల వలసలను ఆపాలని ప్రతిపక్ష నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అయితే తక్షణ చర్చకుస్పీకర్‌ తిరస్కరిస్తూ మార్చి 4వ తేదీన కరువుపై జరిగే చర్చలో ఈవిషయాన్ని ప్రస్తావించవచ్చునని చెప్పారు. కాంగ్రెస్‌ సభ్యుల పట్టువీడకపోవడంతో దాదాపుఅరగంట పాటు శాసనసభా కార్యకలాపాలు స్తంభించాయి.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more