• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జింబాబ్వే పై భారత ఘనవిజయం

By Staff
|
హరారే: భారత్‌ పరువు దక్కించుకొంది. సూపర్‌ సిక్స్‌ పై ఆశలు నిలిచేలా చేసింది. ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాభవం అనంతరం బుధవారం హరారేలో జరిగిన మ్యాచ్‌ లో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌ లోనూ, బౌలింగ్‌ లోనూ రాణించి జింబాబ్వేపై 83 పరుగుల తేడాతో గెలిచింది. 256 పరుగుల విజయలక్ష్యాన్ని జింబాబ్వే ఆటగాళ్ళు చేరుకులేకపోయారు. 44.4 ఓవర్లలో 172 పరుగులకు జింబాబ్వే ఆలౌటైంది. కెప్టెన్‌ గంగూలీ మూడు వికెట్లు తీసుకోవడం విశేషం.

శ్రీనాథ్‌ ఓపెనర్లు ఇద్దరినీ త్వరగా పంపించడం అనంతరం భారత్‌ క్రమపద్దతిలో జింబాబ్వేపై ఒత్తిడిపెంచడంతో విజయం వరించింది. తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ కు ఒపెనర్లు వీరెంద్ర సెహ్వాగ్‌, సచిన్‌ టెండూల్కర్‌ లు శుభారంభాన్ని అందించారు. ఇరువురు ధాటిగా ఆడుతూ ఇరువురు 15 ఓవర్లలో 91 పరుగులు సాధించారు. 99 పరుగుల వద్ద వీరెంద్ర సెహ్వాగ్‌ క్యాచ్‌ ఔటయ్యాడు. దినేష్‌ మోంగియా 12 పరుగులు జతచేసి గ్రాంట్‌ ప్లవర్‌ ఓవర్లో ఔట్‌ అయ్యాడు.

మరో రెండు బంతుల అనంతరం ప్లవర్‌ సచిన్‌ ను కూడా పెవిలియన్‌ దారి పట్టించాడు. 91 బంతుల్లో సచిన్‌ 81 పరుగులు చేశాడు. అనంతరం వచ్చిన కెప్టెన్‌ గంగూలీ పేలవమైన ఆటతీరుతో స్కోర్‌ బోర్డ్‌ మందగించింది. 15 ఓవర్ల వరకు 6 పరుగుల సగటున చేసిన భారత్‌ బ్యాట్స్‌ మెన్‌ అనంతరం 4 పరుగుల సగటుకు చేరుకోవడం వచ్చింది. చివర్లో ద్రావిడ్‌ ఆదుకోని చివరి ఓవర్లో భారత్‌ ను గట్టెక్కించాడు. ఏడు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more