• search

పెట్టుబడుల ఉపసంహరణపై మిత్రుల ధ్వజం

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    న్యూఢిల్లీ: రెండు చమురు కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణపై జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) మిత్రపక్షాలు రెండు తీవ్రంగా ధ్వజమెత్తాయి. లాభాల్లో నడుస్తున్న హెపిసిఎల్‌ (హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌), బిపిసిఎల్‌ (భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌)లలో పెట్టుబడులను ఉపసంహరించాలనే ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని ఎన్‌డిఎ మిత్రపక్షాలు సమతా పార్టీ, జనతా దళ్‌ తీవ్రంగా వ్యతిరేకించాయి. రిలయన్స్‌ గ్రూప్‌ ప్రభుత్వాన్ని ఆడిస్తోందని ఆ పార్టీలు గురువారం లోక్‌సభలో వ్యాఖ్యానించాయి.

    ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్‌, వామపక్షాల సభ్యులు బల్లలపై చరుస్తూ బలపరిచారు. మొత్తం ప్రతిపక్షమంతా మీతో ఉన్నది. మీ వైఖరికి కట్టుబడి వుండండి. ప్రక్రియను వెనక్కి మళ్లించండి అంటూ కాంగ్రెస్‌, వామపక్షాల సభ్యులు అన్నారు.

    ఈ చర్యను మొదట పెట్రోలియం శాఖ మంత్రి రాంనాయక్‌ కూడా వ్యతిరేకించారని, అయితే తర్వాత ఒత్తిడికి తలొగ్గి మౌనం పాటిస్తున్నారని మిత్రపక్షాల సభ్యులు అన్నారు. సభలో చర్చ కోసం తాను నిరీక్షిస్తున్నానని రాంనాయక్‌ అన్నారు.

    జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ రెండు మిత్ర పక్షాల సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని స్తంభింపజేసే ప్రయత్నం చేశారు. రెండు చమురు కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వెంటనే ఆపేయాలని సమతాపార్టీ సభ్యుడు ప్రభుతనాథ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more