వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్లో పేలుడు- నలుగురి మృతి
శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా ప్రధాన చౌక్ వద్ద పేలుడు పదార్థాలను ప్రయోగించి మిలిటెంట్లు నలుగురు పౌరులను బలి తీసుకున్నారు. ఈ సంఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.
ఈ సంఘటన గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది. గాయపడిన నలుగురిలో ముగ్గుర్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు సంభవించిన శ్రీనగర్- యురి జాతీయ రహదారిపై భద్రతా బలగాలు వాహనాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. మరణించినవారిని హజీ గులాం మొహ్మద్ నాజర్, మొహ్మద్ సుల్తాన్ నాజర్, ముష్తాక్ నబీ వని, మీర్ ఉమర్లుగా గుర్తించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!