• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసెంబ్లీలో విపక్షాల పరస్పరారోపణలు

By Staff
|
హైదరాబాద్‌: శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై జరిగిన చర్చ పక్కదారి పట్టింది. లైకిక అంశంపై ఎంఐఎం, టీఆర్‌ ఎస్‌ లు చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం పూర్తిగా వేడేక్కింది. అన్ని పక్షాలు పరాస్పరారోపణలు చేసుకున్నాయి. మతసామరస్యంపై టీడీపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఎం.ఐం.ఎం సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ చేశారు. గోద్రాపై ప్రధాని చేసిన వ్యాఖ్యపై టీడీపీ తన అభిప్రాయం ఏమిటో సభకు తెలియచేయాలని ఆయన కోరారు.

సంఘ్‌, పరివార్‌ శక్తులు ప్రభుత్వ విధానలపై తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆరోపించడంతో బీజేపీ సభ్యుల అడ్డుపడ్డారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్‌.ఇంద్రాసేనారెడ్డి అసదుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఓవైసీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..కోస్తాంధ్రాలో పరివార్‌ నేతల ఆగడాలకు అడ్డూ ఆపూ లేకుండా పోతుందని అన్నారు.

ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాల్లో ఓ గ్రామంలో చర్చి నిర్మాణాన్ని అడ్డుకొన్నారని ఆయన గుర్తు చేశారు. ఇంద్రాసేనారెడ్డి అడ్డుపడుతూ..ఇక్కడ హైదరాబాద్‌ లోనూ..చర్చిలపై దాడి జరిగినప్పుడు వారు ఎక్కడికెళ్ళారు. గోద్రాపై అసెంబ్లీలో జరిగిన చర్చను ఎందుకు అడ్డుకున్నారని ఎంఐఎం సభ్యులను నిలదీశారు.

మరోవైపు, టీఆర్‌ ఎస్‌ కూడా టీడీపీపై లౌకిక అంశంపై తీవ్రమైన విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కె.చంద్రశేఖరరావు వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో హోంమంత్రి టి.దేవేందర్‌ గౌడ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X