• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

1440 మె.వా. ధర్మల్‌ విద్యుదుత్పతి

By Staff
|

హైదరాబాద్‌: వచ్చే మూడేళ్లలో 1440 మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకోనున్నట్లు విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయం చెప్పారు.

నీటి కొరత తీవ్రమైనందున జల విద్యుదుత్పత్తి పడిపోయే ప్రమాదం ఉన్నదని, అందువల్ల బొగ్గు ఆధారిత థర్మల్‌ కేంద్రాల ద్వారా 2006 నాటికి 1440 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. సింగరేణిలోని మణుగూరు, సత్తుపల్లి, తదితర ప్రాంతాల్లోని ఓపెన్‌ కాస్ట్‌ మైన్స్‌ ద్వారా బొగ్గు ఉత్పత్తి పెంచి దాన్ని థర్మల్‌ విద్యుదుత్పతాదనకు వాడుతామని ఆయన చెప్పారు.

అంతకు ముందు సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై 40 నిమిషాల పాటు చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ నియంత్రణ చట్టాన్ని తేకముందే జివికె, బిపిఎల్‌ సంస్థల నుంచి అధిక రేట్లకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది.

బడా పారిశ్రామికవేత్తలు ఈ ఒప్పందాల కోసం ఒత్తిడి తెస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసురా రెడ్డి అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం హయంలోనే నాంది పలికారని సుబ్బారాయుడు అన్నారు. దీనికి కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని- నష్టాల్లో నడుస్తున్న సింగరేణిని తాము లాభాల్లోకి తెచ్చామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X