వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల చేతిలో వార్‌ రహస్యాలు

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: పీపుల్స్‌వార్‌ ఆయుధాల డంప్‌లో పోలీసులకు కీలకమైన పత్రాలు లభ్యమయ్యాయి. అనంతపురం జిల్లాలోని పోలీసులు పీపుల్స్‌వార్‌కు చెందిన ఆయుధాల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో పీపుల్స్‌వార్‌కు చెందిన కీలకమైన పత్రాలు లభ్యమైనట్లు జిల్లా పోలీసు సూరింటిండెంట్‌ అంజనా సిన్హా చెప్పారు.

డంప్‌ నుంచి పోలీసులు మూడు వీడియో క్యాసెట్లు, వ్యూహరచన ప్రతాలు, ఫొటోలు, తదితర రహస్య సమాచారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల వారీగా పీపుల్స్‌వార్‌ టార్గెట్ల వివరాలు కూడా పోలీసుల చేతికి చిక్కాయి. ఈ సమాచారం వల్ల పీపుల్స్‌వార్‌ కార్యకలాపాలను తిప్పికొట్టడం సులభమవుతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. డంప్‌ కాపలాదారు జింకల మాదన్న అలియాస్‌ సన్న మాదన్నను పోలీసులు అరెస్టు చేశారు. దానికి తోడు పీపుల్స్‌వార్‌ నక్సలైట్‌ అరుణ పోలీసులకు లొంగిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X