• search

కరవు జన్మభూమిపై అసెంబ్లీలో రభస

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్‌: ప్రభుత్వం తలపెట్టిన కరవు జన్మభూమిపై మంగళవారం శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఈ రభసతో దాదాపు అర గంట సేపు సభా కార్యక్రమాలు స్తంభించాయి.

    శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టడాన్ని కాంగ్రెస్‌ సభ్యులు వ్యతిరేకించారు. శాసనసభ్యులు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనకుండా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం సరికాదని వారన్నారు. కరవుపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద సోమవారం పికెటింగ్‌ నిర్వహించిన తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేయడంపై చర్చ జరగాలని శాసనసభ సమావేశం కాగానే సిపిఎం సభ్యులు పట్టుబట్టారు. సిపిఎం సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సిపిఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని కాంగ్రెస్‌ సభ్యులు నిరసించారు.

    శాసనసభ సమావేశాలు జరుగుతుండగా కరువు జన్మభూమిని ప్రభుత్వం తలపెట్టడాన్ని ఇదే సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు లేవనెత్తారు. శాసనసభ మీద గౌరవం లేదా, జన్మభూమిలో శాసనసభ్యులు పాల్గొనకూడదా అని ప్రతిపక్ష నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రశ్నించారు. జన్మభూమి విధాన నిర్ణయం కాదని, పాలనాపరమైన వ్యవహారమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కలెక్టర్‌ను, ఇతర జిల్లా ఉన్నతాధికారులను గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించాలని అడిగామని, ప్రజాసమస్యల పరిష్కారానికి జన్మభూమి కార్యక్రమం జరగడానికి అడ్డుంకులెందుకుని రెవెన్యూ మంత్రి పి. అశోకగజపతి రాజు అన్నారు.

    సిపిఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసిన విషయాన్ని మార్చి 4వ తేదీన కరువుపై చర్చ సందర్భంగా ప్రస్తావించవచ్చునని స్పీకర్‌ కె. ప్రతిభాభారతి సిపిఎం సభ్యులకు నచ్చజెప్పారు. దీంతో సభ సద్దుమణిగింది.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more