వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాషింగ్టన్‌ లో ప్రవాసాంధ్రుల సమావేశం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లోరోసిస్‌ సమస్యపై అమెరికన్‌ తెలుగుఅసోసియేషన్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌ (http://www.ataw.org) సమావేశం నిర్వహించబోతున్నది. మార్చి మూడో తేదీ ఆదివారం జరుగునున్న ఈ సమావేశంలో అమెరికాలో భారతీయ రాయబారి లలిత్‌ మాన్‌ సింగ్‌, న్యూజెర్సీ స్టేట్‌ లెజిస్లేటర్‌ ఉపేంద్ర చివుకుల ప్రసంగిస్తారు. తాగునీటిలో ఫ్లోరోసిస్‌ అధిక పరిణామంలో ఉండడం వల్ల నల్గొండ, మహబూబ్‌ నగర్‌, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో లక్షలాది ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు, అకాల వృద్ధాప్యానికి గురవుతున్నారు.

అన్నిరంగాల్లో అభివృద్ధి కన్పిస్తున్నా తమ సాటి తెలుగు ప్రజలుస్వచ్ఛమైన తాగునీటికి నోచుకోకపోవడంవిచారకరమని, ఈ సమస్య తీవ్రతనుప్రవాసాంధ్రుల దృష్టికి తెచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామనిఅమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌ అధ్యక్షుడుదామోదర్‌ వీరారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఇది ఉచిత సమావేశమని, ఎటువంటి ఫీజు గానీ డొనేషన్లు గానీఇవ్వనవసరం లేదని ఆయన స్పష్టంచేశారు.

ఫ్లోరోసిస్‌ సమస్యను ప్రభుత్వందృష్టికి తేవడానికి గురువారం నాడు అసెంబ్లీలోకాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిప్రయత్నించారు. ఆయన నల్గొండ జిల్లాలో ఒక ప్రాంతం ప్రజలుతాగే నీటిని ఒక సీసాలో తెచ్చి డిప్యూటీ స్పీకరుముందు ఉంచారు. ఆ సీసాలోని ఒక స్పూను నీళ్ళను ముఖ్యమంత్రితాగి చూడాలని ఆయన కోరారు. ఫ్లోరోసిస్‌ సమస్యపై ముఖ్యమంత్రికిస్వయంగా వివరించడానికి తాను, న్యూజెర్సీ లెజిస్లేటర్‌ చివుకులపురుషోత్తం కొంత కాలం క్రితం ముఖ్యమంత్రిఅపాయింట్‌ మెంట్‌ కోరినా ఫలితం లేకుండాపోయిందని వెంకటరెడ్డి గుర్తు చేశారు.

తమ తోటి ప్రజలకనీసావసరమైన స్వచ్ఛమైన తాగునీటికోసం ఎక్కడో దూరతీరాల్లో ఉన్న ప్రవాసాంధ్రసంఘాలు కృషి చేయడం ప్రశంసనీయం.తమ విలువైన సమయంలో కొంత భాగాన్నిసమాజసేవా కార్యకమాలకు వినియోగిస్తున్నప్రవాసాంధ్రులు నిజంగా తెలుగుతల్లి ముద్దుబిడ్డలే. వాషింగ్టన్‌ చుట్టుపక్కల ఉన్నతెలుగువారు ఆదివారం నాడు జరిగేసమావేశానికి పెద్ద ఎత్తున హాజరుకావాలనినిర్వాహకులు కోరుతున్నారు.

VENUE:
RESTON REGIONAL LIBRARY
Bowman Towne Dr, Reston,
VA 20190-3311 (Washington D.C. Metro)
DATE: 03-02-03(SUNDAY)
TIME: 3:00PM - 6:00PM

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X