వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాకిస్థాన్ జట్టులో పెరిగిన విభేదాలు
బులావాయో: భారత్ పై ఓటమి పాకిస్థాన్ జట్టును బాగా కుంగదీసింది. తగ్గిన మానసిక స్థైర్యంతో పాటు ఇప్పుడు పాక్ జట్టులో విభేధాలు పొడసూపాయి. ఒక చిన్న వివాదం ముదిరి పెద్దదయింది. మంగళవారం జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ కు ముందు సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనేందుకు పాక్ స్టార్ బ్యాట్స్ మెన్ ఇంజామామ్ ఉల్ హక్ నిరాకరించాడు.
జట్టు సభ్యులంతా వాలీబాల్ ఆడుతుండగా జరిగిన చిన్న ఘటనతో సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇంజామామ్ చేసి గోల్ సరిగా జరిగిందా లేదా అని యూనిస్ ఖాన్ సందేహం వ్యక్తం చేయడంతో గొడవ ప్రారంభమైంది. వెటరన్ బ్యాట్స్ మెన్ సయిద్ అన్వర్ శాంతింపచేసేందుకు ప్రయత్నించగా, ఇంజామాన్ అతన్ని నేల మీద పడేశాడు.
దీంతో కోచ్ పైబస్ మ్యాచ్ ను ఆపేసి అందర్నీ హోటల్ లోకి వెళ్ళాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తిరిగి పాక్ సభ్యుల ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. కానీ ఇంజామామ్ మాత్రం హోటలర్ రూంలోనే ఉండిపోయాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!