వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలెక్టర్‌తో దేశం చర్చలపై దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నెల్లూరు కలెక్టర్‌తో తెలుగుదేశం పార్టీ నేతల సమావేశం బుధవారం శాసనసభలో దుమారం రేపింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యులు, నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జీలు మంగళవారం నెల్లూరు జిల్లా కలెక్టర్‌ అనంతరాములుతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఆవరణలోని మంత్రి అదాల ప్రభాకర్‌ రెడ్డి ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశాన్ని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ సభ్యులు అడ్డుకున్నారు.

కలెక్టర్‌తో తెలుగుదేశం నేతలు సమావేశమైన విషయంపై అత్యవసర చర్చకు అనుమతించాలంటూ కాంగ్రెస్‌, సిపిఎం సభ్యులు వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. అయితే ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ ప్రతిభా భారతి త్రోసిపుచ్చారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘణకు పాల్పడ్డారని కాంగ్రెస్‌ ఆరోపిస్తూ ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. జిల్లాలోని ఇతర పార్టీల శాసనభ్యులను ఆహ్వానించకుండా తెలుగుదేశం నేతలతో కలెక్టర్‌ సమావేశం కావడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్‌, సిపిఎం సభ్యులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాల సభ్యులు నల్లకండువాలు ధరించి సభకు వచ్చారు.

కరువు పరిస్థితి గురించి చర్చించడానికే మంత్రి చంద్రమోహన్‌ రెడ్డి కలెక్టర్‌తో సమావేశమయ్యారని, కలెక్టర్‌ను మంత్రి కలిస్తే రాజ్యాంగ ఉల్లంఘన ఎలా అవుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కలెక్టర్‌ సమావేశానికి ఇతర పార్టీల శాసనసభ్యులను పిలవకుండా వారిపై ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులను పిల్చారని, అటువంటప్పుడు ఓడిపోయిన తెలుగుదేశం నేతలనే శాసనసభలో కూర్చోబెట్టండని సిఎల్‌పి నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఆవేశంగా అన్నారు.

సమావేశానికి శాసనసభ్యులను ఆహ్వానించాలి గానీ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జీలను పిలవడమేమిటని కాంగ్రెస్‌ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసురారెడ్డి అడిగారు. ప్రజాప్రతినిధులను విశ్వాసంలోకి తీసుకోకపోవడమేమిటని సిపిఎం సభ్యుడు నోముల నర్సింహయ్య అన్నారు. ఈ వాగ్వివాదంతో దాదాపు గంట సేపు సభా కార్యక్రమాలు స్తంభించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X