For Daily Alerts
సాయంలో ప్రాంతీయ వివక్ష: వైయస్
అనంతపురం: కరువు సహాయంఅందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయవివక్షను పాటిస్తోందని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డివిమర్శించారు. అనంతపురం జిల్లాలో కరువు వల్ల,విద్యుత్ కోత వల్ల పంటలకు జరిగిన నష్టాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు.
కరువు సహాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతానికో రీతిగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం బడా వ్యాపారులకు దోచిపెట్టడం ఆపేస్తే రైతులకు, కూలీలకు సహాయంఅందించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!