వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంకపై భారత్‌ ఘనవిజయం

By Staff
|
Google Oneindia TeluguNews

జోహన్నెస్‌ బర్గ్‌: భారత్‌ జట్టుసెమీస్‌ లోకి దర్జాగా ప్రవేశించింది. సోమవారం ఇక్కడ జరిగిన సూపర్‌సిక్స్‌ మ్యాచ్‌ లో భారత్‌ అన్నిరంగాల్లోనూ పైచేయిగానిలిచి లంకపై 183 పరుగుల తేడాతో భారీ విజయాన్నిసాధించింది. సచిన్‌ టెండూల్కర్‌, సెహ్వాగ్‌ లవీరోచిత బ్యాటింగ్‌, శ్రీనాథ్‌ సూపర్‌ బౌలింగ్‌ ధాటికి లంకవిలవిలలాడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఆరువికెట్ల నష్టానికి 292 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

శ్రీలంక ఏ దశలోనూ భారత్‌ కు పోటీనివ్వలేదు. బౌలింగ్‌ లోనూ, బ్యాటింగ్‌ లోనూ లంక దారుణంగావిఫలమైంది. శ్రీలంక టాప్‌ ఆర్డర్‌ ను శ్రీనాథ్‌ కుప్పకూల్చాడు. తొలి మూడు ఓవర్లలోనే ఆటపట్టు,అరవింద డిసిల్వా, ముబారక్‌ వికెట్లు కోల్పయింది.వీరి ముగ్గురు వికెట్లను శ్రీనాథే తీయడం విశేషం.

వీరితో పాటు మహిల జయవర్ధనే కూడా జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌ లో డకౌట్‌ కావడం విశేషం. కెప్టెన్‌ జయసూర్య కూడాపెద్దగా పరుగులేమీ సాధించకుండా ఎనిమిదో ఓవర్లలో శ్రీనాథ్‌ బౌలింగ్‌ లోకైఫ్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం సంగక్కర కాస్తా బ్యాట్‌ ఝలిపించిత్వరత్వరగా 30 పరుగులు చేసిసీనియర్‌ ఆటగాళ్ళ దగ్గరికి చేరుకున్నాడు. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించిమిగతా ఆటగాళ్ళను 22 ఓవర్లలో ఔట్‌ చేశారు. శ్రీలంక22.5 ఓవర్లలో 109 పరుగులు చేసి ఆలౌటింది. శ్రీనాథ్‌, నెహ్రాలు చెరో నాలుగు వికెట్లు తీసుకోగా జహీర్‌ ఖాన్‌ రెండు వికెట్లు వికెట్లు తీసుకున్నాడు.భారత్‌ కేవలం ఈ ముగ్గురు బౌలర్లనే వినియోగించుకోవడం విశేషం.

టాస్‌ గెలిచిన లంక కెప్టెన్‌ జయసూర్య భారత్‌ కు బ్యాటింగ్‌ అప్పగించాడు. ఓపెనర్లు సచిన్‌ టెండూల్కర్‌,వీరేంద్ర సెహ్వాగ్‌ లు ధాటి ఆడుతూ పరుగుల వర్షం కురిపించారు. బౌండరీల హోరెత్తించారు.సెహ్వాగ్‌ ప్రపంచ కప్‌ మ్యాచ్‌ లో తొలిసారి నిలదొక్కుకొని 20 ఓవర్లు ఆడాడు.వీరువురూ తొలి వికెట్‌ కు 153 పరుగుల భారీ భాగస్వామ్యాన్నిఅందించి భారత్‌ ను పటిష్ట స్థితిలో ఉంచారు. 26వ ఓవర్‌ లోసెహ్వాగ్‌ మురళీధరన్‌ బౌలింగ్‌ లో సిక్సర్‌ కు ప్రయత్నించిఅరవింద డిసిల్వాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

72 బంతుల్లో సెహ్వాగ్‌ 66 పరుగులు చేశాడు. అనంతరం గంగూలీ సచిన్‌ తో కలసి స్కోర్‌ వేగాన్నిపెంచారు. సచిన్‌ 97 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బంతినిస్వీప్‌ చేయబోయి క్యాచ్‌ ఔటయ్యాడు. దీంతో సచిన్‌ మరోసెంచరీకి తెరపడింది. గంగూలీ, సచిన్‌ లు రెండోవికెట్‌ కు 61 పరుగులు జోడించారు. అనంతరం వచ్చినకైఫ్‌, యువరాజ్‌ సింగ్‌, ద్రావిడ్‌ లు ఎవరూ భారీ భాగస్వామ్యానికి ప్రయత్నించలేదు.అయినప్పటికీ పరుగులు తగ్గలేదు.

300 పైచిలుకు పరుగలు భారత్‌ సాధిస్తుందని భావించినప్పటికీ, చివర్లోముత్తయ్య మురళీధరన్‌, చమిందావాస్‌ లు భారత్‌ ఆటగాళ్ళను నిలువరించారు. దీంతో 50 ఓవర్లలో భారత్‌ ఆరువికెట్ల నష్టానికి 292 పరుగుల లక్ష్యాన్ని లంక ముందు ఉంచింది. గంగూలీ 48 పరుగులు సాధించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X