వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లోరోసిస్‌పై నిలదీసిన విపక్షాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఫ్లోరోసిస్‌ సమస్యపై ప్రతిపక్షాలు సోమవారం శాసనసభలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఫ్లోరోసిస్‌ సమస్యపై తక్షణ చర్చకు కాంగ్రెస్‌, సిపిఎంలు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలనుస్పీకర్‌ కె. ప్రతిభా భారతి త్రోసి పుచ్చారు.

ఫ్లోరోసిస్‌ సమస్యపై నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని,అందువల్ల ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించివివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ సభ్యుడు రఘువీరా రెడ్డి అన్నారు. సహచర శాసనసభ్యుడు దీక్ష చేపట్టినా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆయనవిమర్శించారు. జిల్లా మంత్రి గానీ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గానీ దీక్షా శిబిరానికి ఎందుకు వెళ్లలేదని కాంగ్రెస్‌ సభ్యుడు అడిగారు.

దీక్ష చేస్తున్న సభ్యుడి విషయాన్ని తాము పట్టించుకుంటున్నామని, సభలోని 293 మంది సభ్యులను కూడా తాము పట్టించుకుంటామని భారీ పరిశ్రమల మంత్రి కోటగిరి విద్యాధర రావు చెప్పారు. ఫ్లోరోసిస్‌ సమస్యపై సంబంధిత మంత్రి మంగళవారం ప్రకటన చేస్తారని, ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలనువివరిస్తారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. దీంతో సంతృప్తి చెందని కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఫ్లోరోసిస్‌ పీడిత ప్రాంతాల ప్రజలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయంలో ప్రభుత్వంవిఫలమైందని విమర్శించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X