• search

అప్పుడే ఏమైంది, కప్‌ గెలవాలి: గంగూలీ

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    జోహన్నెస్‌ బర్గ్‌: వరుసవిజయాలను తలకెక్కించుకోలేదని, అన్ని మ్యాచ్‌ లను గెలవడమే లక్ష్యంగా భావిస్తున్నామని భారతజట్టు కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు.సెమీస్‌ కు చేరుకోవడం ఆనందంగా ఉన్నప్పటికీ, శుక్రవారం నాడు జరిగే కివీస్‌ మ్యాచ్‌ ను తేలికగా తీసుకోవడం లేదని తెలిపాడు. ఈ సిరీస్‌ లో ఇంత దూరం రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే, అప్పుడే కప్‌ గెలిచినంతగా ఫీలవడం లేదు. నేనే కాదు జట్టులోఅందరూ కప్‌ గెలవడమే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికీ భూమ్మీదనే ఉన్నామని గంగూలీ బుధవారం భారతీయవిలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.

    భారత్‌ జట్టు ఫైనల్‌ లోకి ప్రవేశించినట్లేనని నిపుణులు చెప్పడాన్ని గంగూలీ కొట్టిపారేశాడు. వారు అలా భావిస్తే భావించొచ్చు. కానీ అప్పుడే ఏమైంది. నిజంగాఫైనల్‌ కు వెళ్ళాలి కదా!అని ప్రశ్నించాడు. ప్రతి మ్యాచ్‌ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని గంగూలీ తెలిపాడు.కివీస్‌ టూర్‌ లో భారత్‌ వైఫల్యం తమపై ఎటువంటి ప్రభావం చూపదన్నాడు.

    ఫ్లెమింగ్‌ కు భారత్‌ పై గెలుస్తామని నమ్మకుంటే మంచిదే, మేం మాత్రం గతం గురించి ఆలోచించం. గెలవడమే పనిగాపెట్టుకున్నామని గంగూలీ ఫ్లెమింగ్‌ చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చాడు.

    మరోవైపు, ఫైనల్‌ మ్యాచ్‌ కు దక్షిణాఫ్రికా వెళ్ళేది,లేనిది ఇంకా నిర్ణయించుకోలేదని గంగూలీ భార్య డోనా తెలిపారు. ప్రస్తుతం కోల్‌ కతాలో తమస్వగృహంలో ఉన్న టీవీ ద్వారానే భర్త బృందం సాధిస్తోన్నవిజయాలను వీక్షిస్తోన్న డోనా భారత్‌ ఫైనల్‌ కు వెళితే దక్షిణాఫ్రికా వెళ్ళాలని ఉబలాటపడుతున్నారు. అయితే, ఇప్పటివరకు ఏదీ డిసైడ్‌ చేసుకోలేదని ఆమె కోలకతాలోపీటీఐ ప్రతినిధికి తెలిపారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more