వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగూలీ సేనపై లంకసేన ఆశలు

By Staff
|
Google Oneindia TeluguNews

జోహన్నెస్‌ బర్గ్‌: శ్రీలంక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. లంక తమ జట్టువిజయం సాధించాలని కోరుకునే బదులు భారత్‌ న్యూజిలాండ్‌ పై గెలవాలని దేవుణ్ణి ప్రార్థిస్తోంది. భారత్‌ తన అద్భుతమైన ఫామ్‌ అలాగే కొనసాగిస్తేనే లంకసెమీస్‌ లోకి అడుగుపెట్టే అవకాశం ఉటుంది. జింబాబ్వాతో లంక శనివారం నాడు మరో సూపర్‌సిక్స్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉన్నా, ఆ జట్టు మాత్రం ప్రస్తుతం శుక్రవారం నాటి మ్యాచ్‌పైనే దృష్టిని సారించింది.

శుక్రవారం భారత్‌, కివీస్‌ లపై మేం ఓ కన్నేసి ఉంచాం. సారీ రెండు కన్నులతో చూస్తున్నాం. మేం ముందుకెళ్ళాలంటే భారత్‌ కు మా సాయం చేయాలని లంక్‌ జట్టు కోచ్‌ డేవ్‌ వాట్‌ మోర్‌ నవ్వుతూ అన్నాడు.

జింబాబ్వేతో గెలవడం ముఖ్యమే కానీ ముందు భారత్‌ కివీస్‌ పై గెలవాలి కదాని ఆయనవిలేకరులతో గురువారం నాడు ఇక్కడ విలేకరులతో పేర్కొన్నాడు. 7.5 పాయింట్లతో ఉన్న లంకసెమీస్‌ లోకి అడుగుపెట్టాలంటే ముందు కివీస్‌ ఓడిపోవాలి.

అప్పుడు మాత్రమే దానికి అవకాశాలుంటాయి. లేదంటే జింబాబ్వాపై గెలిచినా లంక ఇంటికి వెళ్ళాల్సిందే. అయితే, కెప్టెన్‌ సనత్‌ జయసూర్య చేతివేలు గాయం ఇంకా మానకపోవడం ఆ జట్టును వేధిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X