• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నికల సంస్కరణలపై సుప్రీం ఆదేశం

By Staff
|

న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలవిషయంలో సుప్రీంకోర్టు గురువారంనాడు చారిత్రకమైన తీర్పు వెలువరించింది. అభ్యర్థులు నామినేషన్లు వేసే సందర్భంలోనే తమ ఆస్తులవివరాలను, నేర చరిత్రను వెల్లడించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జస్టిస్‌ ఎం.బి.షా, జస్టిస్‌ పి.వి. రెడ్డి, జస్టిస్‌ డి.ఎం. ధర్మాధికారిలతో కూడిన బెంచ్‌ ఈ తీర్పు వెలువరించింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 33 బికి చేసిన సవరణ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భారత ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల చట్టం రూపకల్పనలో చిత్తశుద్ధి ప్రదర్శించలేదని, ఇది ఎన్నికల్లో ధన, భుజ బలాల వాడకాన్ని తగ్గించలేదని కోర్టు అన్నది. ప్రస్తుత తీర్పు మేరకు ఎన్నికల కమీషన్‌ కొత్త మార్గదర్శకత సూత్రాలను వెల్లడించాలని సూచించింది.

తగిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి అభ్యర్థుల నేర చరిత్ర, ఆస్తుల,అప్పుల వివరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉన్నదని సుప్రీంకోర్టు నిరుడు మే 2వ తేదీన ఆదేశించింది. ప్రభుత్వం తెచ్చిన చట్టం ఈ ఆదేశాల స్ఫూర్తిని ప్రతిఫలించడం లేదని సుప్రీంకోర్టువిమర్శించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X